![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -263 లో... శ్రీవల్లితో చందు కోపంగా మాట్లాడతాడు. నువ్వు నాతో మాట్లాడకని చిరాకు పడతాడు. దాంతో శ్రీవల్లి ఏడుస్తుంది. శ్రీవల్లి తన పుట్టింటికి వచ్చి జరిగింది మొత్తం చెప్తుంది. మీరు ఇప్పుడు పది లక్షలు ఇస్తేనే నా కాపురం బాగుంటుందని శ్రీవల్లి చెప్తుంది. సరే.. ఎలాగోలా సర్దుబాటు చేస్తానని భాగ్యం హామీ ఇచ్చి శ్రీవల్లి ని పంపిస్తుంది.
అంత డబ్బు ఎలా తీసుకొని వస్తామని భాగ్యంతో ఆనందరావు అంటాడు. అప్పుడే భద్రవతి, విశ్వ కలిసి భాగ్యం ఇంటికి వస్తారు. మీరెందుకు వచ్చారని భాగ్యం అడుగుతుంది. నాకొక సహాయం కావాలి.. మీకు కావాల్సిన డబ్బు ఇస్తానని భద్రవతి చెప్తుంది. పాతికేళ్ళుగా నా చెల్లికి దూరంగా ఉంటున్నాను.. ఇప్పుడు నా మేనకోడలికి కూడా.. ఇక ఈ దూరం భరించలేను.. నా మేనల్లుడు విశ్వకి రామరాజు చిన్న కూతురు అమూల్యకి పెళ్లి చేస్తే ఇరు కుటుంబాలు కలుస్తాయి. మేము వెళ్లి రామరాజుతో మాట్లాడితే ఒప్పుకోడు.. నీ కూతురు ఆ అమూల్యకి, విశ్వకి మధ్య సఖ్యత ఏర్పడేలా చేయాలని భద్రవతి చెప్తుంది. మొదట భాగ్యం ఒప్పుకోదు. విశ్వ పదిలక్షలు తీసుకొని రాగానే ఒప్పుకుంటారు.
మరోవైపు ఏ టెన్షన్ లేదు.. ఆ కళ్యాణ్ గాడు ఫోన్ చెయ్యడని ప్రేమ అనుకుంటుంది. కళ్యాణ్ ఫోన్ చేసి.. నేను చెప్పినట్టు చెయ్యకపోతే నేను నిన్ను లేపుకుని వెళ్లిన విషయం.. అలాగే ఏ పరిస్థితిలో ధీరజ్ నిన్ను పెళ్లి చేసుకున్నాడో.. మీ మావయ్యకి చెప్తానని కళ్యాణ్ బ్లాక్ మెయిల్ చేస్తాడు. మరొకవైపు ప్రేమ ఎందుకు టెన్షన్ పడుతుందో.. తన ఫ్రెండ్స్ ని ధీరజ్ అడుగుతాడు. ఎవరు తెలియదని అంటారు. ఆ తర్వాత ఆనందరావు, భాగ్యం కలిసి శ్రీవల్లి దగ్గరికి వెళ్తుంటే దారిలో తనే ఎదురుపడుతుంది.
తరువాయి భాగంలో కళ్యాణ్ చెప్పిన అడ్రెస్ కి ప్రేమ వెళ్తుంది. కళ్యాణ్ తన భుజంపై చేయి వేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |